ముంబయిలోని ప్రసిద్ధ శివాజీ పార్క్‌లో రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ హాజరై తన చిన్ననాటి కోచ్ స్మారకాన్ని ఆవిష్కరించారు. తాను క్రికెట్లో గొప్ప స్థాయికి ఎదగడానికి ఆచ్రేకర్ కూడా కారణమని గుర్తుచేసుకున్నారు. ఆచ్రేకర్‌ను ఆల్-రౌండర్‌గా పేర్కొన్నారు.