38వ జాతీయ క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడలకు సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) క్రీడల తేదీ, జాబితాను విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌లో 28 జనవరి 2025 నుంచి 14 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ పోటీల్లో IOA 32 ఒలింపిక్ క్రీడలతోపాటు ఉత్తరాఖండ్‌లోని మల్కామ్, యోగాసన్, రాఫ్టింగ్, కలరియట్టు క్రీడలను చేర్చింది.