భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనెల 22న పీవీ సింధుకు హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయితో వివాహం జరగనుంది. వరడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని సింధు తండ్రి తెలిపారు. నెల రోజుల క్రితమే ముహూర్తం ఖాయం చేశామని, జనవరిలో సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.