KMM: జిల్లాలో ఈనెల 7నుంచి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఈనెల 7,8 తేదీలలో గ్రామస్థాయిలో, 10,12తేదీలలో మండల, మున్సిపల్ స్థాయిలో, 16 నుంచి 21 జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు.