ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఈనెల 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, స్టార్ బ్యాటర్ కోహ్లీ మోకాలికి బ్యాండేజీ వేసుకుని ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కోహ్లీ రెండో టెస్టులో ఆడతాడా? లేదా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.