ప్రకాశం: జిల్లా సంతనూతలపాడులో వర్షాల ప్రభావంతో స్థానిక జడ్పీ హెచ్ఎస్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తేదీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 5 నుంచి 8 వరకు స్థానిక జడ్పీహెచ్ఎస్లో నిర్వహించాల్సి ఉండగా, తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 7 నుంచి 10 తేదీ వరకు మార్పులు చేసినట్లు తెలిపారు.