భారత జట్టు ఏదైనా పెద్ద సిరీస్ ఆడుతుంటే అందరి దృష్టి స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్లపైనే ఉంటుంది. కానీ ఇప్పుడు.. పెర్త్ టెస్టులో తన అసాధారణ బౌలింగ్‌తో INDకు విజయాన్ని అందించిన స్టార్ పేసర్ బుమ్రా పేరు మార్మోగుతోంది. ఎక్కడ చూసినా అతని నామస్మరణే. ఆసీస్ స్టార్ క్రికెటర్లు సైతం అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అంటూ.. కొనియాడుతున్నారు. బుమ్రా ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బౌలర్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు.