బ్రిటన్కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ ఛాంపియన్ టెర్రీ గ్రిఫిత్ కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో 77 ఏళ్ల గ్రిఫిత్ నిన్న కన్నుమూసినట్లు ఆయన కుమారుడు వేన్ సోషల్ మీడియాలో తెలిపాడు. కాగా బస్ కండక్టర్గా, పోస్ట్మన్గా పనిచేసిన గ్రిఫిత్ 1978లో ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్గా ఎదిగి 1979లోనే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచి దిగ్గజ ప్లేయర్గా చరిత్రలో నిలిచాడు.