టీమిండియా పేసర్ షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. అయితే అతడి బౌలింగ్, ఫిట్నెస్ను బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్మెంట్, సెలెక్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే షమీని ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పంపే అంశాన్నిబీసీసీఐ పరిశీలిస్తుందని తెలుస్తోంది.