ప్రకాశం: మార్కాపురంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తంగిరాల సౌజన్య కరాటే పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఈ శ్రీదేవీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో సౌజన్య హాజరై సత్తా చాటిందన్నారు. దీంతో సౌజన్యను హెచ్ఎం, ఫిజికల్ డైరెక్టర్ ఉమాదేవి అభినందించారు.