CTR: కుప్పం మండలం టి. సదుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 4న త్రోబాల్ అండర్-17 క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయులు పద్మనాభరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పాఠశాలల నుంచి బాలుర, బాలికలు ఈ పోటీలకు హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.