అండర్-19 ఆసియా కప్‌లో భారత్ బోణీ కొట్టింది. జపాన్‌పై యువ భారత్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జపాన్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128కి పరిమితమైంది. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్, కార్తికేయ, చేతన్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. యుధజిత్ ఒక వికెట్ తీశాడు.