సెహ్వాగ్ తర్వాత భారత్ తరపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా కరుణ్ నాయర్ నిలిచిన విషయం తెలిసిందే. సచిన్, రాహుల్ వంటి దిగ్గజాలకు సైతం ఆ ఫీట్ సాధ్యం కాలేదు. 2013-14లో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ ఆ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్లో 328 పరుగులు చేశాడు. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కరుణ్‌కు అన్యాయం జరిగిందంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అతడికి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.