ATP: మండలంలోని రేకలకుంట గ్రామంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ నెల 6వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు తెలిపారు. ఇందులో నూతన రకాల వంగడాలు, నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వివిధ వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా రైతులు హజరుకావాలని సూచించారు.