HYD: JNTU యూనివర్సిటీలో బుధవారం సౌత్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. సెక్రెటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ దిలీప్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేరళలో ఈ సౌత్ ఇంటర్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయని వారు తెలిపారు.