ఇటీవల ఐసీసీ ఛైర్మన్గా జై షా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. తదుపరి బీసీసీఐ కార్యదర్శిగా ఎవరవుతారని క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనిల్ పటేల్(గుజరాత్), ప్రస్తుత బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్జిత్ సైకియా, రోహన్ జైట్లీ(ఢిల్లీ) ఈ పదవి రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.