టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఆసీస్‌తో రెండో టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వందలాది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలో ఆసీస్ అభిమానులు భారత ఆటగాళ్లను ఎగతాళి చేశారు. దీంతో ఈ టూర్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించొద్దని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించింది.