ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌కు వేలంలో భారీ ధర పలికింది. 1947-48లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ సుమారు రూ.2.63 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా, స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు అదే చివరి సిరీస్. ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా 715 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ నెట్టింట వైరల్ అవుతోంది.