యువ క్రికెటర్ పృథ్వీ షా వరుస వైఫల్యాలతో తన కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఫిట్నెస్లేమితో ముంబయి రంజీ జట్టులో చోటు కోల్పోగా.. IPL మెగా వేలంలోనూ అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు. షా ఆటతీరు ఇలానే ఉంటే మరో సచిన్ ఏమో గానీ మరో కాంబ్లీగా మిగిలిపోతాడని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.