HYD: హుస్సేన్‌సాగర్ వెళ్లేవారు ఇక ఫుల్ ఎంజాయ్ చేసేయొచ్చు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్‌ను మంత్రి జూపల్లి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్‌లో జెట్ స్కీపై సరదాగా విహరించారు. కొత్తగా వాటర్ రోలర్, జెట్ అటాక్, కాయక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.