అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ఆసీస్, భారత్ మధ్య రెండో (పింక్ బాల్) టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో పిచ్‌పై ఆరు మిల్లీమీటర్ల గడ్డిని ఉపయోగిస్తామని పిచ్ హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ పేర్కొన్నాడు. కొత్త బంతితో ఫ్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుందని డామియన్ హగ్ వెల్లడించాడు.