ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ రూట్ కొత్త రికార్డ్ నమోదు చేశాడు. కీవీస్‌తో జరుగుతున్న టెస్ట్‌లో రూట్ (73*) పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్ 151 టెస్టుల్లో 65 హాఫ్ సెంచరీలు, 35 సెంచరీలతో 100 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ద్రవిడ్(99) పేరుతో ఉండేది. తర్వాతి స్థానాల్లో చంద్రపాల్(96), సంగక్కర(90), బోర్డర్(90...
శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 40 పరుగులు చేయడంతో టెస్ట్‌ల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంక తరపున సంగక్కర(12,400), జయవర్ధనే(11,814) మాత్రమే ఈ రికార్డ్ సాధించారు. దీంతో మాథ్యూస్ 8 వేల పరుగులు పూర్తి చేసిన మూడో శ్రీలంక క్రికెటర్‌గా నిలిచాడు.
పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 128 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడంతో జైస్వాల్(24), రాహుల్(7), గిల్(28), కోహ్లీ(11), రోహిత్(6) పరుగులకే పెవిలియన్ చేరారు. బోలాండ్ 2, కమిన్స్ 2, స్టార్క్ 1 తలో వికెట్ తీసుకున్నారు. క్రీజ్‌లో పంత్(28), నితీష్(15) ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 29 పరుగుల లీడ్‌లో ఉంది.
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌పై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పింక్ బాల్‌తో 40 ఓవర్ తరువాత కూడా స్వింగ్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు. అది కేవలం స్టార్క్‌కు మాత్రమే సాధ్యం. అతడు ఒక పింక్ బాల్ మాంత్రికుడు’ అని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత స్టార్ పేసర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై అభిమానుల్లో సందేహాలు వచ్చాయి. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 81వ ఓవర్ వేసిన బుమ్రా కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే ఫిజియో సహాయం తీసుకున్న అతడు ఆ ఓవర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా బౌలింగ్ కంటిన్యూ చేసి.. కమిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చ...
AP: కడప మున్సిపల్ హైస్కూల్‌లో పేరెంట్స్- టీచర్ మీటింగ్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో పవన్ ముచ్చటించారు. దేశం బాగుండాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలన్నారు. అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలనేది తన కోరిక అని వెల్లడించారు. హీరోలు సినిమాల్లో కాదు, ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారన్నారు.
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(140), మార్నస్ లాబుస్చాగ్నే(64), నాథన్ మెక్‌స్వీనీ(39) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా రెండో సెషన్ ముగిసేనాటికి 332/8 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్‌కి 152 ఆధిక్యంలో ఉంది. ట్రావిస్ హెడ్(140) పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్(18*) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ అంశం ఇవాళ ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. హైబ్రిడ్ మోడల్‌కు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, మిగతా టోర్నీల్లో తాము ఆడే మ్యాచ్‌లకూ హైబ్రిడ్ మోడల్‌లోనే జరగాలని కోరినట్లు సమాచారం. దీంతో జై షా నేతృత్వంలో ఇవాళ సాయంత్రం జరగనున్న సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ పట్టు వదలడం లేదు. తమకు ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ దీనిపై స్పందించాడు. బీసీసీఐ ఎప్పుడూ ఆటగాళ్ల రక్షణ గురించే ఆలోచిస్తుందని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైందేనని.. దేశంలోని ప్రతిఒక్కరం స్వాగతిస్తాం అని వెల్లడించాడు.
147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. కాగా, 1082 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 500000+ పరుగులు చేసింది. ఇంగ్లండ్ తర్వాత ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా.. భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న అడిలైడ్ డే/నైట్ టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆసీస్ బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఆసీస్.. 55 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక క్రీజ్‌లో పాతుకుపోయిన మార్నస్ లబుషేన్ (62)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ట్రావిస్ హెడ్ 26*, మిచెల్ మార్ష్ 0* ఉన్నారు.
PPM: పార్వతీపురం పట్టణానికి చెందిన దువ్వెల యోగేశ్వరి అనంతపురం జిల్లాలో నవంబర్ 23, 24 తేదీలలో జరిగిన అంతర జిల్లాల 68 వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలలో పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈసందర్బంగా పంజాబ్‌లో జరగబోయే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికైన సందర్భంగా యేగేశ్వరిని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అభినందించి, ఆర్థిక సహకారం అందజేశారు.
పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. దీంతో ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడంటూ నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అయితే, వాటిని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కొట్టిపడేశాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ 9 వేలకుపైగా పరుగులు చేశాడని.. కంగారు పడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. కొన్నిసార్లు ఔటైనంత మాత్రాన ఏం అవుతుంది...
MLG: జిల్లా హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాయ్స్ ఎంపికలు నిర్వహించినట్లు హ్యాండ్ బాల్ ఇంఛార్జ్ కోచ్ కుమారస్వామి తెలిపారు. క్రీడల అధికారి తుల రవి హాజరై 40 మంది క్రీడాకారుల్లో 12 మందిని ఆల్ ఇండియా ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక చేశారన్నారు. వీరంతా జనవరి 27 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.