SKLM: జిల్లా జూనియర్స్ M/F జట్ల ఎంపికలు ఈనెల 15 వ తేదీన జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ శ్రీకాకుళం చైర్మన్,MLA శంకర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎంపికలు కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వేదికగా ఆదివారం ఉ. 9 గంటల నుంచి మొదలవుతాయన్నారు. మరిన్ని వివరాలకు పీడీ సాదు శ్రీనివాస్ (9441914214)ను సంప్రదించాలన్నారు.
అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్-ట్రావిస్ హెడ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రత్యర్థులు మనపై ఎంత తీవ్రంగా స్పందిస్తే.. అదే స్థాయిలో సమాధానం చెప్పాలని అభిప్రాయపడ్డాడు. అలాగే, ఇప్పటికే సిరాజ్- హెడ్‌ల వివాదం చల్లారిందని తెలిపాడు. దూకుడుగా ఉండటం సీమర్ల లక్షణం.. సిరాజ్ అదే చేశాడని పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతని మార్కెట్ విలువపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్‌ల కంటే 2024 ప్రథమార్ధంలో అత్యధిక బ్రాండ్‌లకు ఎండోర్స్‌మెంట్ చేస్తున్న వ్యక్తిగా ధోనీ నిలిచాడు. ఈ మేరకు ‘TAM మీడియా రిసెర్చ్’ నివేదిక విడుదల చేసింది. ధోనీ 42 బ్రాండ్‌లతో మొదటి స్థానంలో ఉండగా.. అమితాబ్ (...
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమినే భారత అత్యుత్తమ బౌలర్ అని వెస్టిండీస్ దిగ్గజ పేసర్ ఆండీ రాబర్ట్స్ అన్నాడు. ‘షమి కొంతకాలంగా భారత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అతడు బుమ్రా అన్ని వికెట్లు పడగొట్టకున్నా.. అతని వద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయి. బుమ్రా వలే బంతిపై మంచి నియంత్రణ ఉంది. ఆసీస్‌తో జరిగే మూడో టెస్టులో షమిని ఆడించాలి’ అని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
BGTలో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచి సిరీస్‌పై ఆసక్తి రేకెత్తించాయి. WTC ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కావడంతో తర్వాతి 3 మ్యాచ్‌లు మరింత హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో DEC 26 నుండి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్‌కు ఇంకా 15 రోజులు సమయం ఉన్నా.. మొదటి రోజు ఆటకు సంబంధించి టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
VSP: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్ట్ అరంగేట్రం చేసిన విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో 163 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. అంతేకాకుండా ఓ ఇన్నింగ్స్ అత్యధికంగా ఏడు సిక్సర్‌లు బాది టెస్ట్‌లో వీరేంద్ర స్వెహాగ్ పేరిట ఉన్న ఆరు సిక్సర్ల రికార్డును బద్దలకొట్టాడు.
IPL మెగా వేలంలో రూ. 23.75 కోట్ల భారీ ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ ఇప్పుడు PHD చేస్తున్నాడు. ఇప్పటికే ఎంబీఏ పూర్తి చేసిన అతడు ఓ ఇంటర్వ్యూలో తాను ఫైనాన్స్‌లో PHD చేస్తున్నట్లు తెలిపాడు. ‘క్రికెట్ అనేది కొంతకాలమే ఆడగలం. కానీ చదువు మనం మరణించేంత వరకు ఉంటుంది. క్రికెటర్లకు క్రికెట్ గురించే కాకా మిగతా విషయాలపై కూడా అవగాహన ఉండాలి’ అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
AUSతో రెండో టెస్టు ఓడిపోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న వేళ అతడికి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు.’ రోహిత్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడి సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలొద్దు. తిరిగి పుంజుకుంటాడు. అతడి కెప్టెన్సీలోనే కొన్ని నెలల క్రితం T20 ప్రపంచకప్ గెలిచిన విషయం మరిచిపోకూడదు’ అని అన్నాడు.
SKLM: జిల్లా బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ ఉ.6 గంటలకు సీనియర్ విభాగంలో F/M బాక్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి లక్ష్మణదేవ్ ప్రకటనలో తెలిపారు. DEC 31, 2005 లోపు పుట్టిన క్రీడాకారులు పోటీలకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు ఆరోజు ఉ. 6 గంటలకు కోడిరామ్మూర్తి క్రీడామైదానానికి ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 371 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ తడబడుతూ 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో 122 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై 3 వన్డేల సిరీస్ 2-0తో కోల్పోయింది. భారత్ బ్యాటర్లలో రిచా ఘోష్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో సదర్‌లాండ్ 4 వికెట్లతో సత్తాచాటింది.
అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు ఘోర ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో తమ జట్టు సమిష్టిగా విఫలమైంది. మేం అందివచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదు. అదే మా ఓటమిని శాసించింది. పింక్ బాల్‌తో ఆడడం సవాల్‌తో కూడుకున్నది. ఆస్ట్రేలియా మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. తరువాతి టెస్టుపై ఫోకస్ చేస్తాం’ అని పేర్కొన్నాడు.
ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్‌పై ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 60.71 శాతం పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. 57.29 శాతంతో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా.. 59.26 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్‌పై ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 60.71 శాతంతో తొలిస్థానంలో ఉంది. 57.29 శాతంతో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా.. 59.26 శాతంతో రెండో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. టీమిండియాకు తలనొప్పిగా మారాడు. AUSతో జరిగిన కీలక మ్యాచుల్లో అతడు భారత్‌పై ప్రతిసారి పైచేయి సాధిస్తున్నాడు. WTC-2023 ఫైనల్లో 163 పరుగులు చేసి టీమిండియాకు టైటిల్ దూరం చేశాడు. అలాగే 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో మెరుపు సెంచరీతో భారత్‌ను దెబ్బకొట్టాడు. ఇక ఇప్పుడు ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులోనూ.. శతకం బాది ఆసీ...
గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియా ఒక గెలుపు, మూడు ఓటములు అన్న రీతిలో ప్రదర్శన చేస్తోంది. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి గంభీర్ కోచింగ్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలో తొలి టెస్టు గెలిచిన భారత్.. రెండో టెస్టులో చేతులెత్తేసింది. దీంతో గంభీర్ కోచింగ్‌పై అనుమానాలు వస్తున్నాయి. అసలు అతడు ఏం చేస్తున్నాడంటూ క్రీడాభిమానులు ఆగ...