T20 WCలో వెస్టిండీస్ జట్టుకు ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ రికార్డు ఉంది. ఇదే వేదికపై జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి వెస్టిండీస్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తంగా T20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విండీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.