67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేస్తూ.. జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించారు. జట్టు మొత్తానికి రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.