19వ సీజన్ తర్వాత ధోనీ IPL నుంచి రిటైర్ అవుతాడనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘ధోనీ రిటైర్ అవ్వాలా? వద్దా? ఏం చేయాలనేది అతనికే చెప్తా. మీడియాకు కాదు’ అని పేర్కొన్నారు. అటు ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగేలా అయితే రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిందేనని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. CSKలో కీపర్ బాధ్యతల కోసం శాంసన్ ఉన్నాడన్నాడు.
IPL నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే IPL 2025-27 రూల్స్ ప్రకారం.. వేలంలో ఎంపికై, తర్వాత టోర్నీ నుంచి తప్పుకున్న ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం పడుతుంది. గాయం, వైద్యం, అత్యవసర కారణాలకే మినహాయింపు ఉంటుంది. దీంతో ఇప్పటికే ఈ సీజన్ నుంచి తప్పుకున్న డకెట్.. 2027 & 28 సీజన్లకూ దూరం అయినట్లే.
మాల్దీవుల్లో జరిగిన బోటు ప్రమాదంలో భారత మాజీ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం లగ్జరియస్ స్పీడ్ బోటు తిరగబడటంతో అందులోని ఏడుగురు సముద్రంలో పడిపోయారు. ఈ ఘటనలో అర్జున అవార్డీ, సెయిలర్ మహేశ్ రామచంద్రన్‌తో పాటు వెటరన్ ర్యాలీ డ్రైవర్ ‘జిప్సీ కింగ్’ హరిసింగ్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరి మరణంపై పలువురు క్రీడాకారులు సంతాపం తెలియజేశారు.
IPL 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్లకు ఢిల్లీ దక్కించుకున్న ఈ ప్లేయర్.. ‘ఇది ఎంతో కఠిన నిర్ణయం. కానీ చిన్నప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నా కల, దానికోసం పూర్తిగా శ్రమిస్తా. సమ్మర్(NZ&IND మల్టీ ఫార్మాట్ సిరీస్) కోసం ఫిజికల్లీ, మెంటల్లీ సిద్ధమయ్యేందుకు సిద్ధమవ్వాలి. ఢిల్లీ టీమ్, అభిమానులకు క్షమాపణలు’ అని తెలిపాడు.
పశ్చిమాసియాలో యుద్ధం, ఇంధన కొరత నేపథ్యంలో (PSLపై ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డ్ సెటైర్లు వేసింది. ‘లక్షలాది మంత్రి క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు PSL వస్తోంది. అయితే PSL అంటే ఏంటా అని అనుకునేవాళ్లం.. దానర్థం పెట్రోల్ షార్టేజ్ లీగ్ అని తేలింది’ అంటూ ట్వీట్ చేసింది. కాగా పెట్రోల్ కొరతతో PSL ఈ సారి 2 వేదికల్లో, ఫ్యాన్స్ లేకుండానే జరగనున్న సంగతి తెలిసిందే.
IPL 2026 సీజన్ ఓపెనర్‌లో RCB, SRH తలపడనున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో ఈ నెల 28న జరిగే ఈ పోరుకు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు బెంగళూరులో 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనా.. మ్యాచ్ సమయానికి వర్షం పడేందుకు 60% ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో ఆటకు పదేపదే అంతరాయం కలగొచ్చని అంచనా వేసింది.
భారత జట్టు కంటే IPL టీమ్ కూర్పే కష్టమని సౌరవ్ గంగూలీ అన్నాడు. IPL 2026 కోసం DC ప్లేయర్ మిచెల్ స్టార్క్ రాకపై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో.. ‘భారత్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండే బెస్ట్ ప్లేయర్లు IPLలో 10 వేర్వేరు జట్లలో ఆడతారు. ఇలాంటప్పుడు క్వాలిటీ ప్లేయర్లు చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే టీమ్ బ్యాలెన్స్ కోల్పోతుంది’ అని పేర్కొన్నాడు.
RCBని దక్కించుకోవడంపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా IPL ప్రపంచ క్రీడారంగంలో పవర్‌హౌస్‌గా ఎదిగిందని, RCB వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం IPL ఛాంపియన్‌గా ఉన్న ఈ జట్టు, త్వరలో జరగబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనున్న తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
IPL-2026లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తే టీమిండియా తదుపరి T20 కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 2028 ఒలింపిక్స్ వరకు సూర్య కెప్టెన్‌గా కొనసాగుతాడని తెలిపాడు. ఆ తర్వాత జరిగే T20 WCలో భారత్‌ను నడిపించే ఛాన్స్ అయ్యర్‌కు దక్కవచ్చన్నాడు. అయ్యర్‌కు అద్భుతమై కెప్టెన్సీ నైపుణ్యాల ఉన్నాయని చోప్రా వ్యాఖ్యానించాడు.
యాజమాన్య మార్పుతో RCB కొత్త బోర్డు కొలువుదీరింది. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్ గ్రూప్ సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కన్సార్టియంలో బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. RCB టీంను గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని కొత్త యాజమాన్యం ప్రకటించింది.
ఐపీఎల్ చరిత్రలో కళ్లు చెదిరే భారీ డీల్ కుదిరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సార్టియం $1.78 బిలియన్లకు(సుమారు రూ.16,732 కోట్లు) దక్కించుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి 100% వాటాను కొనుగోలు చేసిన ఈ ఒప్పందంలో పురుషుల ఐపీఎల్ టీంతో పాటు మహిళల డబ్ల్యూపీఎల్(WPL) టీం కూడా ఉండటం విశేషం.
ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన కొనసాగుతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా కాకముందే ఈ రూల్ ప్రవేశపెట్టారని తెలిపాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ రూల్ ఎక్కడికీ వెళ్లదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
IPL 2026 సీజన్‌లో బీసీసీఐ కొత్త రూల్ తీసుకురానుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ జట్టు 10 ఓవర్ల తర్వాత బంతిని మార్చమని అంపైర్లను కోరవచ్చు. మంచు ప్రభావం వల్ల బౌలర్లు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంపైర్లు పాత బంతికి సమానమైన స్థితిలో ఉన్న మరో బంతితో దానిని మారుస్తారని సమాచారం.
RCB సుమారు రూ.18,800 కోట్లకు ($2 బిలియన్లు) అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికన్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌లతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మార్చి 31లోపు ఈ డీల్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.