• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

బుమ్రా బౌలింగ్ అద్భుతం: సూర్య, బ్రూక్

T20 WC సెమీస్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడని భారత్, ఇంగ్లండ్ కెప్లెన్లు సూర్య, బ్రూక్ కితాబిచ్చారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న ప్రత్యర్థిని కట్టడి చేయడంలో బుమ్రా రాణించాడని.. ఇతర బౌలర్లూ ఇంగ్లండ్ గెలవకుండా చేశారని సూర్య అన్నాడు. బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని బ్రూక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా అక్షర్ పట్టిన తన క్యాచ్ తాను చూసినవాటిల్లో బెస్ట్ అని చెప్పాడు.

March 6, 2026 / 09:16 AM IST

T20 WC: వరుణ్ చెత్త రికార్డ్

ఇంగ్లండ్‌తో సెమీస్‌లో వరుణ్ తన మార్క్ ప్రదర్శన చేయలేకపోగా.. ఏకంగా 64 రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో T20 WC ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత్ బౌలర్‌గా వరుణ్(64/1) నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ జోగిందర్ శర్మ(2007లో 57/0 vs ENG) పేరిట ఉండేది. ఓవరాల్‌గా USA బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్(65/0 vs IND) అగ్రస్థానంలో ఉన్నాడు.

March 6, 2026 / 08:57 AM IST

చెత్త రికార్డ్.. ధోనీ సరసన దూబే

T20 WC సెమీస్‌లో రనౌట్ అవ్వడంతో శివమ్ దూబే(43) ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఒకే ఎడిషన్ టోర్నీలో అత్యధికంగా 3 సార్లు రనౌటయిన ఆటగాడిగా నిలిచి, 19 ఏళ్ల నాటి MS ధోనీ రికార్డ్ సమం చేశాడు. ఈ టోర్నీలో దూబే నమీబియా, పాక్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల్లో రనౌట్ కాగా.. 2007 టోర్నీలో ధోనీ న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో ఇలాగే వెనుదిరిగాడు.

March 6, 2026 / 08:25 AM IST

SRH రికార్డ్ బ్రేక్ చేసిన భారత్

ఇంగ్లండ్‌పై T20 WC సెమీస్ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా 253/7 స్కోర్ చేసిన సూర్యసేన అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. T20 ఫార్మాట్‌లో అత్యధికంగా 6 సార్లు 250+ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ IPL టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(5) పేరిట ఉండేది. విండీస్(3)-జింబాబ్వే(3) మూడో స్థానంలో ఉన్నాయి.

March 6, 2026 / 07:36 AM IST

ఏకైక క్రికెటర్‌గా బెథెల్ సరికొత్త రికార్డ్

భారత్‌తో T20 WC సెమీస్‌లో అద్భుత ఇన్నింగ్స్(105) ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఫస్ట్ క్లాస్(టెస్ట్ ఫార్మాట్), లిస్ట్-A(వన్డే), T20 సెంచరీలను సాధించిన తొలి- ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. సాధారణంగా ప్లేయర్లు తమ తొలి సెంచరీ(3 ఫార్మాట్లు)ని డొమెస్టిక్, ఫ్రాంచైజీ క్రికెట్‌లో నమోదు చేస్తుంటారు.

March 6, 2026 / 07:20 AM IST

T20 WC నాకౌట్స్‌లో టాప్ 5 ప్లేయర్ల స్కోర్స్

➤ జాకబ్ బెథెల్ – 105 vs IND (2026 సెమీస్)➤ ఫిన్ ఆలెన్ – 100* vs SA (2026 సెమీస్)➤ తిలకరత్నే దిల్షాన్ – 96* vs WI (2009 సెమీస్)➤ విరాట్ కోహ్లీ – 89  vs WI (2016 సెమీస్)➤ సంజూ శాంసన్ – 89 vs ENG (2026 సెమీస్)☞ ఇందులో 3 ప్రస్తుత టోర్నీలోనే నమోదవడం విశేషం.

March 6, 2026 / 07:04 AM IST

టీమిండియా విజయం మహాద్భుతం: షర్మిల

టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో టీమిండియాపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశంసలు కురిపించారు. భారత్ విజయం మహాద్భుతమని తెలిపారు. ‘సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ఇండియా క్రికెట్ జట్టు సభ్యులకు అభినందనలు. ఫైనల్‌లో ఇండియా విజయం సాధిస్తుంది’ అని పోస్ట్ చేశారు.

March 6, 2026 / 06:40 AM IST

నేటి నుంచి ఆసీస్‌తో ఏకైక టెస్ట్

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత అమ్మాయిలు ఇవాళ్టి నుంచి ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్‌లో తలపడనున్నారు. మ్యాచ్ పెర్త్ వేదికగా ఉ.10:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 6 సిరీస్‌ల్లో భారత్ ఒక్కటే గెలిచింది. మరో 2 డ్రా కాగా.. 3 కంగారూల సొంతమయ్యాయి. ఈ పర్యటనలో ఇప్పటికే T20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్ ఇందులోనైనా రాణించాలని చూస్తోంది.

March 6, 2026 / 06:30 AM IST

T20 WC FINAL: భారత్ Vs న్యూజిలాండ్

T20 WC-2026లో భాగంగా టీమిండియా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. కాగా, 2021 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రస్తుతం T20 ఫైనల్‌లోనూ న్యూజిలాండ్, భారత్ తలపడనున్నాయి.

March 6, 2026 / 05:20 AM IST

250+ అయినా కొట్టొచ్చు: సంజూ శాంసన్‌

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన సంజూ శాంసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కీలకమైన మ్యాచుల్లో రాణించడం ఆనందంగా ఉంది. వాంఖడే పిచ్‌పై 250+ పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించేందుకు ఆస్కారముందని అనిపించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు జస్‌ప్రీత్ బుమ్రా అర్హుడని నా భావన. అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌’ అని తెలిపాడు.

March 6, 2026 / 01:15 AM IST

BREAKING: ఫైనల్‌కు భారత్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246/7 రన్స్‌కే పరిమితమైంది. బెతెల్‌ 105, బట్లర్ 25, విల్‌ జాక్స్‌ 35 రన్స్‌ చేశారు. 

March 5, 2026 / 10:53 PM IST

అభిషేక్ శర్మపై నెటిజన్ల ఫైర్

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన కీలకమైన సెమీఫైనల్‌లోనూ ఘోరంగా విఫలమవడంతో, అతడిని జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకోవడం వల్ల మిగిలిన బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అభిమానులు మండిపడుతున్నారు.

March 5, 2026 / 09:56 PM IST

విజయానికి 151 దూరంలో.. ఉత్కంఠగా సెమీస్

254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కేవలం 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. అయితే.. సాల్ట్ (5), బట్లర్ (25), బ్రూక్ (7), బంటన్ (17) వంటి కీలక బ్యాటర్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జాకబ్ బెథల్ (43), విల్ జాక్స్ (4) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 71 బంతుల్లో 151 పరుగులు చేయాల్సి ఉంది.

March 5, 2026 / 09:47 PM IST

T20 WC: ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు

➣ సంజూ శాంసన్‌ – 16 సిక్స్‌లు (2026*)➣ రోహిత్‌ శర్మ – 15 సిక్స్‌లు (2024)➣ శివం దూబే – 15 సిక్స్‌లు (2026*)➣ ఇషాన్‌ కిషన్‌ – 14 సిక్స్‌లు (2026*)➣ హార్దిక్‌ పాండ్యా – 14 సిక్స్‌లు (2026*)➣ యువరాజ్‌ సింగ్‌ – 12 సిక్స్‌లు (2007)

March 5, 2026 / 09:07 PM IST

టీ20 ప్రపంచకప్‌లో భారత్ సిక్సర్ల మోత

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఏకంగా 19 సిక్సర్లు బాదింది. దీంతో ప్రస్తుత T20 WCలో టీమిండియా ఖాతాలో 84 సిక్సర్లు* చేరాయి. ఫలితంగా, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో 76 సిక్సర్లతో వెస్టిండీస్ (2026) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

March 5, 2026 / 09:00 PM IST