ఈనెల 14 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టులో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఒకవేళ అతడు సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాలోని ప్రధాన 5 వేదికల్లో శతకాలు బాదిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును గవాస్కర్, కుక్ మాత్రమే అందుకున్నారు.
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల ఆర్చరీ పోటీలను ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ స్పోర్ట్స్ బోర్డ్ ఛైర్మన్ అయిన ప్రొఫెసర్ జి.సుధాకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్చరీ క్రీడపై క్రీడాకారులు మక్కువ చూపిస్తున్నారని అన్నారు.
విరాట్ కోహ్లీపై భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని ఆడటంలో కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి బలహీనత గురించి మహ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడిన బౌలర్లకూ కోహ్లీ ఎలా ఔటవుతాడో తెలుసని పేర్కొన్నాడు.
గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహం మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో టెస్టులోనూ కేఎల్ రాహుల్- జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్లు అలాగే బ్యాటింగ్‌కు వచ్చారు. కాగా, గత మ్యాచ్‌లో ఆరో డౌన్‌గా వచ్చిన రోహిత్ శర్మ.. ఈసారి టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్...
ధోనీపై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసలు కురిపించాడు. అతడితో మాట్లాడిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని తెలిపాడు. ధోనీ లాంటి నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని కొనియాడాడు. అతని ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. మతిశా పతిరన లాంటి యువ బౌలర్‌ను డేంజరస్ మ్యాచ్ విన్నర్‌గా తీర్చిదిద్దాడని.. తన ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి బాగా తెలుసన...
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో బీచ్ వాలీబాల్ జరగనున్నాయి. ఈ పోటీల నిమిత్తం గురువారం అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పీఈటీ, డీఈఓ, స్పోర్ట్స్ అధికారులు, వాలీబాల్ పోటీల నిర్వహణ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ప్రసారకర్తలు ఐసీసీకి ప్రతిపాదించారు. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పాకిస్థాన్ అంగీకరించకపోవడంతో ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీంతో టోర్నీకి సమయం దగ్గరపడుతున్నందున మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని ప్రసారకర్తలు ఐసీసీకి తెలిపారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ కీలక దశకు చేరుకుంది. ఇవాళ చివరి 14వ రౌండ్ జరగనుంది. 13 రౌండ్లు ముగిసే సరికి భారత్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డింగ్ లిరెన్ చెరో 6.5 పాయింట్లతో సమనంగా ఉన్నారు. ఇవాళ జరిగే ఈ చివరి గేమ్‌లో గుకేశ్ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌గా నిలువనున్నాడు.
భారత క్రికెట్‌లో ప్రపంచకప్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. ఇవాళ ఆయన 43వ పుట్టినరోజు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి బ్యాటుతో పాటు బంతితోనూ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి విజయాన్ని అందించాడు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువీదే కీలక పాత్ర. ఇక 2007లో ENGపై కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సర్లను క్రికెట్ ప్రేమికులు అంత ఈజీగా మర్చిపోరు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 144/6 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో జింబాబ్వే నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. అజ్మతుల్లా బౌలింగ్‌లో తుషింగ ముసేక్వా 4,2,2,0,2,1 పరుగులు చేసి జట్టుకు థ్రిల్లి...
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ గబ్బా వేదికగా డిసెంబర్ 14న జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్రిస్బేన్‌లో గత రెండు రోజుల నుండి భారీ వర్షం కురుస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్యూవెదర్ తెలిపింది. WTC ఫైనల్ చేరడానికి భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్ల నుంచి గొప్ప ప్రదర్శనేమీ రాలేదని ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. వన్‌డౌన్, సెకండ్ డౌన్ బ్యాటర్లలో నిలకడ లేదని తెలిపాడు. ఇదే తమ జట్టును ఒత్తిడికి గురి చేస్తోందని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడి సెంచరీతో ఆదుకున్నాడని చెప్పాడు. అయితే, హెడ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు అవసరమని.. కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే ఆడిత...
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 14 గేమ్‌లలో 13 మ్యాచ్‌లు ముగిశాయి. నేడు జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. ఇద్దరు ఆటగాళ్లు 6.5-6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. రేపు జరిగే చివరి మ్యాచ్‌లో గెలుపొందిన ఆటగాడు ఛాంపియన్‌గా నిలుస్తాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో సిరాజ్- హెడ్‌ల మధ్య వాగ్వాదం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ‘హెడ్ వికెట్ తీసినప్పుడు సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. అతడు ఇచ్చిన సెండాఫ్‌ను చూశా. అప్పుడు నాకు సిరాజ్ గురించి ఆందోళన మొదలైంది. బ్యాటర్లకు డ్రెస్సింగ్ రూమ్‌ను చూపిస్తూ సెండాఫ్‌లు ఇవ్వడం రిఫరీ, అంపైర్లకు నచ్చ...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో విదర్భపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై.. ఈ లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ముంబై ఓపెనర్లు పృథ్వీ షా (49), అజింక్య రహానె (84) దంచికొట్టారు.