హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. దీంతో ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కేన్ చరిత్ర సృష్టించాడు. హ్యామిల్టన్‌లో కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1563 పరుగులు చేశాడు. కాగా, కేన్‌కు టెస్ట్‌ల్లో ఇది 33వ సెంచరీ.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. టీ బ్రేక్ సమయానికి భారత్.. 48/4 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (30*), రోహిత్ శర్మ (0*) క్రీజులో ఉన్నారు. యశస్వి 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అలాగే, టీబ్రేక్‌కు కొద్ది సేపటి ముందు పలుమార్లు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
భారత అభిమానులకు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్, మహిళా కామెంటేటర్ ఇసా గుహ క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గుహ.. బుమ్రాను ప్రశంసిస్తూ నోరు జారింది. కోతి జాతికి చెందిన జంతువుతో బుమ్రాను పోల్చింది. దీంతో ఆమెపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆమె.. బుమ్రాకు...
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. 418 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (14*), పంత్ (4*) క్రీజులో ఉన్నారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. అరగంట పాటు నిలిచిన ఈ మ్యాచ్ 9.15 గంటలకు తిరిగి ప్రారం...
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇబ్బందుల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మళ్లీ విఫలమైంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (13*), రిషభ్ పంత్ (0*) ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో యశస్వి (4), గిల్ (1), విరాట్ కోహ్లీ (3) పరుగులతో నిరాశపరిచారు.
భారత మహిళల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్ మొదటి నుంచి సత్తాచాటింది. ఫైనల్లో మాజీ చాంపియన చైనాను 1-1(3-2) తేడాతో షూటౌట్లో చిత్తు చేసింది. దీంతో సౌత్ కొరియా, చైనా తర్వాత వరుసగా రెండుసార్లు, ఒక్కటి కంటే ఎక్కువసార్లు టైటిల్ నెగ్గిన మూడో జట్టుగా భారత్ నిలిచింది.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ షాక్ తలిగింది. 6 పరుగులకే భారత్.. రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1) తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (1*) , విరాట్ కోహ్లీ (1*) ఉన్నారు.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ షాక్ తలిగింది. 6 పరుగులకే భారత్.. రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1) తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (1*) , విరాట్ కోహ్లీ (1*) ఉన్నారు.
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ హైస్కూల్లో ఈనెల 20న సీఎం కప్ జిల్లాస్థాయి జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు డివైఎస్ఓ రాజ్ వీర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కనప రమేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సీఎం కప్ పోటీలకు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఫామ్‌తో పాటు ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు.
బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (152), స్మిత్ (101) సెంచరీలతో రాణించారు. ఇక టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. కాగా మూడో రోజు ఆట మొదలైంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి కంగారుల స్కోరు 405/7 గా ఉంది. ట్రావిస్ హెడ్ 152, స్టీవ్ స్మిత్ 101 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు కైవసం చేసుకున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)ని ముంబై సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని సమష్ఠి ప్రదర్శనతో ఛేదించింది. సూర్య (48), రహానే (37), పృథ్వీ షా (10), శ్రేయస్ (16), సూర్యాంశ్ (36*),అథర్వా (16*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. శివం, వెంకటేశ్, కార్తికేయ తలో వికెట...
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (81*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో శార్దూల్, రాయ్స్టన్ చెరో 2 వికెట్లు తీయగా.. అథర్వ, శివం దుబే, సూర్యాంశ్ తలో వికెట్ తీశారు. ముంబై లక్ష్యం 175.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. మంగళగిరిలోని క్యాంపు ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంను తండ్రి రమణతో కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈనెల 22న వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. మరోవైపు వారు అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.