మరో రెండు రోజుల్లో ఐపీఎల్-2026 ప్రారంభం కానుంది. గత ఏడాది ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవగా ఈ సారి పలు జట్లు విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి. అలాగే తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్, నితీష్ కుమార్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏది? ఏ జట్టు విజేతగా నిలుస్తుంది? ఏ క్రికెటర్ బాగా ఆడతాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
శనివారం నుంచి IPL 2026 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టసభ్యుల కోసం రాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం వీఐపీలం.. క్యూలో నిలబడం’ అని విజయానంద్ వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్‌ను BCCI తాజాగా ప్రకటించింది. లీగ్ దశలోని మిగిలిన 50 మ్యాచ్‌లను 12 వేదికలలో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, HYD, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, చండీగఢ్‌లలో జరగనున్నాయి. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి దశ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ముంబైలో జరిగిన IPL కెప్టెన్ల సమావేశంలో క్యాచ్‌ల విషయంలో బీసీసీఐ కీలక స్పష్టతనిచ్చింది. ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన కొన్ని క్యాచ్‌ల వీడియోలను ఈ సందర్భంగా కెప్టెన్లకు చూపించింది. క్యాచ్ ప్రక్రియ పూర్తి కాకముందే బంతిని గాలిలోకి విసరడం లేదా ఫీల్డర్ తన శరీరంపై నియంత్రణ కోల్పోవడం వంటివి జరిగితే.. దానిని ‘నాటౌట్’గానే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
IPL-2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 5న మ.3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో SRH, LSG జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఈరోజు సా.5 గంటలకు ప్రారంభమయ్యాయి. ‘District by Zomato’ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక SRH జెర్సీని ఉచితంగా పొందవచ్చు.
IPL-2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 5న మ.3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో SRH, LSG జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఈరోజు సా.5 గంటలకు ప్రారంభమయ్యాయి. ‘District by Zomato’ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక SRH జెర్సీని ఉచితంగా పొందవచ్చు.
IPL-2025 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు జితేశ్ శర్మను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, వేలం తర్వాత పంజాబ్ యజమాని ప్రీతి జింటా తనకు ఫోన్ చేసి, బడ్జెట్ పరిమితుల వల్ల తనను తిరిగి కొనుగోలు చేయలేకపోయినందుకు ‘సారీ’ చెప్పిందని తాజాగా వెల్లడించాడు. ఒక ఫ్రాంఛైజీ ఓనర్ ఇలా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని జితేశ్ పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ జోడీ ఈ టోర్నీలోనే అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలుస్తుంది. వీరిద్దరి బ్యాటింగ్ శైలి ప్రత్యర్థి బౌలర్లకు సవాలుగా మారుతుంది. ఒకరు బంతిని క్లాస్‌గా టైమ్ చేస్తే, మరొకరు చాలా బలంగా బాదుతారు’ అని వ్యాఖ్యానించాడు.
IPL- 2026 సీజన్ ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో హెడ్ కోచ్ రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్‌తో పాటు ఇతర కోచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
SRH కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే భారత్‌కు చేరుకుని జట్టుతో కలిశాడు. అయితే, గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో IPL 2026 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం కమిన్స్ SRH మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఏప్రిల్ చివరిలో కమిన్స్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
BCCI తాజాగా 2026-27 హోం సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే జట్లతో మూడు మ్యాచ్‌ల చొప్పున మొత్తం 9 వన్డేల్లో తలపడనుంది. 2027 ODI WCను దృష్టిలో ఉంచుకుని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేలా బీసీసీఐ ఈ ప్రణాళికను సిద్ధం చేసింది.
LSG కెప్టెన్ రిషభ్ పంత్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని డుప్లెసిస్ సూచించాడు. ఆ స్థానం పంత్‌కు సరిగ్గా సరిపోతుందన్నాడు. పంత్ అనవసరమైన రిస్క్ తీసుకోకుండా, నిలకడగా బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. పంత్‌తో పాటు మార్‌క్రమ్, మార్ష్, పూరన్ వంటి ఆటగాళ్లతో LSG బ్యాటింగ్ బలంగా ఉందని కొనియాడాడు.