• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఆసుపత్రి నుంచి సచిన్‌కు కాంబ్లీ థాంక్స్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి థానేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కాంబ్లీ సచిన్ టెండుల్కర్‌కు థాంక్స్ చెప్పాడు. కష్టకాలంలో తనకు మద్ధతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

December 24, 2024 / 03:50 PM IST

అశ్విన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు..?

టీమిండియా స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇన్ని రోజులు సేవలందించిన అశ్విన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని ప్రశ్న తలెత్తుతోంది. టీమిండియాలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఎవరు అశ్విన్ స్థానాన్ని భర్తీ చేస్తారో కామెంట్ చేయండి.?

December 24, 2024 / 03:49 PM IST

నా భార్యకు ముద్దులు ఇవ్వలేదు: అశ్విన్

అశ్విన్ రాసిన తన బయోగ్రఫీపై మరిన్ని విషయాలు చెప్పాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ అడిగారు. ‘క్రికెటర్‌గా  కొనసాగినప్పుడు నాకు ఆశించినంత గుర్తింపు రాలేదు. ప్రజలు నేను సీరియస్‌గా ఉంటానని భావిస్తారు. కానీ నేను సీరియస్‌గా ఉండే వ్యక్తిని కాదు. డ్రెస్సింగ్ రూంలో ఉన్న నా భార్యకు ముద్దులు విసరలేదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

December 24, 2024 / 03:35 PM IST

‘డాక్టర్ల వల్లే నేను బతికి ఉన్నా’

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఠానెలోని ఓ ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చికిత్స పొందుతున్నారు. పలు టెస్టులు జరిపిన డాక్టర్లు అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక్కడి డాక్టర్ల వల్ల బతికి ఉన్నానని ఆసుపత్రి బెడ్‌పై నుంచి కాంబ్లీ పేర్కొన్నారు.

December 24, 2024 / 01:02 PM IST

భారత్ మహిళల అండర్-19 టీ20 టీమ్ ఇదే..

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టును ప్రకటించింది. భారత జట్టు: నిక్కి ప్రసాద్(కెప్టెన్), సానికా చాల్కే(వైస్ కెప్టెన్), కమలిని జి(వికెట్ కీపర్‌), జి త్రిష, భావికా అహిరే(వికెట్‌ కీపర్‌), ఈశ్వరి, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, ఎండీ షబ్నమ్‌, ఎస్. వైష్ణవి.

December 24, 2024 / 12:21 PM IST

స్కేటింగ్ పోటీల్లో అక్క, తమ్ముడి ఘనత

VZM: భోగాపురం మండలంలోని బొల్లింకలపాలెం గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు కార్తిక శరణ్య, లోహిత్ రెడ్డి స్కేటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన 62వ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఇద్దరు చిన్నారులు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు కార్తీక శరణ్య జిల్లా, రాష్ట్రస్థాయిలో 45 పతకాలు, లోహిత్ రెడ్డి 28 పతకాలు సాధించారు.

December 24, 2024 / 10:36 AM IST

జాతీయస్థాయికి ఎంపికైనా క్రీడాకారులు

ADB: తమిళనాడులో జరిగే జాతీయస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి హాసిని, శివాత్మిక, సింధూజ ఎంపికయ్యారు. వారిని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమేశ్, కోశాధికారి రమేశ్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, కోచ్ అరవింద్ అభినందించారు. జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలని సూచించారు.

December 24, 2024 / 10:27 AM IST

జిల్లా స్థాయి పోటిల్లో గెలుపొందిన మండల జట్టు

MBNR: సీఎం కప్ పోటిల్లో వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటిల్లో బొంరాస్ పేట్ మండల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. క్రీడాకారులు నర్సిములు, శ్రీశైలం, అశోక్, మహేష్, ప్రభాకర్, గంగాధర్, మల్లేష్, రాహుల్, అఖిలేష్, రాఘవేందర్, ప్రవీణ్, మహబూబ్ ప్రతిభ కనబర్చడంతో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.

December 24, 2024 / 07:49 AM IST

బాడీ బిల్డింగ్ గోల్డ్ మెడలిస్ట్‌కు ఘనస్వాగతం

SKLM: జాతి స్థాయిలో ఇటీవల జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన పాగోటి సతీష్‌కు కంబకాయ గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్న సతీష్‌ను ప్రాంతవాసులు స్వాగతించి నరసన్నపేట నుంచి కంబకాయ వరకు ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచి, మాజీ సర్పంచి తదితరులు పాల్గొన్నారు.

December 24, 2024 / 07:32 AM IST

ఈనెల 27 నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

వరంగల్: సీఎం కప్-2024’లో భాగంగా ఈ నెల 27 నుంచి 30 వరకు వరంగల్ ఓసిటీ మైదానంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి కోరారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

December 24, 2024 / 06:09 AM IST

బధిరుల జట్టును అభినందించిన: జేసి

SKLM: విశాఖ జోన్1 పరిధిలో జరిగిన T 20 క్రికెట్ పోటీల్లో శ్రీకాకులం బధిరుల జట్టు విజేతగా నిలవడంతో క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం అభినందించారు. ZP సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 5 జిల్లాలతో పోటీపడి ట్రోఫీని గెలుచుకోవడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. బధిర సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు.

December 24, 2024 / 05:23 AM IST

ఈనెల 30న దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు

E.G: రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రికెట్‌లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలు ఈనెల 30న ప్రకటించనున్నట్లు జిల్లా కన్వీనర్ శ్యాం గంగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఈనెల 28లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9299401222 నంబర్‌ను సంప్రదించ వచ్చునన్నారు.

December 24, 2024 / 05:05 AM IST

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు విద్యార్థుల ఎంపిక

PDPL: సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపికైనట్లు మంథని జేకేఏ షోటాకాన్ కరాటే ఇన్‌స్ట్రక్టర్ కొండ్ర నాగరాజ్ సోమవారం తెలిపారు. బాబి వర్మ, ఇంద్రాణి, రోహిత్, శ్రావణ్ కుమార్, శ్రీచరణ్, తోట హాసిని, ఆదిత్య తేజ బహుమతులు గెలుపొందినట్లు వివరించారు. ఈనెల 31 నుండి జనవరి 2 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

December 24, 2024 / 04:22 AM IST

రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపిక

MDK: కల్హేర్ మండలం కృష్ణాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల 57వ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నర్సాపూర్‌లో జరిగిన ఎంపికల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు సంయుక్త, సోనా, పూజ వర్ష, శ్రీలత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు సుధాకర్ తెలిపారు. వారిని పీఈటీ రాములు, ఉపాధ్యాయుల బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.

December 24, 2024 / 04:12 AM IST

IND vs AUS: టీమిండియాకు భారీ షాక్‌!

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా హిట్‌మ్యాన్ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

December 22, 2024 / 12:41 PM IST