భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతడి సతీమణి మేహా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్షర్ పంచుకున్నాడు. అయితే ఐదు రోజుల క్రితమే తనకు కొడుకు పుట్టాడని తెలిపాడు. తనకి ‘హక్ష పటేల్’ అని పేరు పెట్టిన్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కుమారుడికి టీమిండియా జెర్సీ వేసిన ఫోటోను షేర్ చేశాడు.
భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతడి సతీమణి మేహా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్షర్ పంచుకున్నాడు. అయితే ఐదు రోజుల క్రితమే తనకు కొడుకు పుట్టాడని తెలిపాడు. తనకి ‘హక్ష పటేల్’ అని పేరు పెట్టిన్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కుమారుడికి టీమిండియా జెర్సీ వేసిన ఫోటోను షేర్ చేశాడు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించినట్లు యూనివర్సిటీ పీడీ వై.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రో. శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప, OSD మధుసుదన్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత పేసర్ షమీ దూరమవడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. షమీని జట్టు నుంచి మినహాయిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని చోప్రా సమర్థించాడు. జట్టు పరంగా ఆలోచించినప్పుడు ఈ నిర్ణయం సరైందేనంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
‘ఖేల్ రత్న’ నామినేషన్లలో వివక్షపై మరో ఛాంపియన్ ఆరోపణలు చేశారు. పారా ఒలింపియన్లను గుర్తించడం లేదంటూ పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్విందర.. ఈ ఏడాది పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. అథ్లెట్ మను బాకర్ నామినేషన్ వివాదం వేళ ఈ పారా ఆర్చర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SKLM: రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 27న జరగనున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి ఆరోజు ఉదయం హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95051 33888 నంబరును సంప్రదించాలని కోరారు.
KNR: హుజురాబాద్ ఎంజేపీ బాలికల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని గోలిపల్లి అంజలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో, ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు, ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. దీంతో అంజలి స్వగ్రామమైన మహ్మదాపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను అభినందించారు.
NRML: ఈనెల 27న హైదరాబాదులో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ అభిలాష శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా నుంచి 550 మంది రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనబోతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని అభినందించారు.
MNCL: బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయన్షి రన్నర్‌గా నిలిచినట్లు మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్తో హోరాహోరీగా తలపడి రన్నర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఖేల్ రత్న అవార్డుల నామినేషన్ల జాబితాలో షూటర్ మనూ బాకర్‌కు చోటు దక్కిని విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఏదో లోపం జరిగి ఉండొచ్చని.. దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఒక అథ్లెట్‌గా దేశం కోసం ఆడటం తన బాధ్యత అని వెల్లడించారు. అవార్డులు తనకు స్ఫూర్తినిస్తాయే.. కానీ, అవే తన లక్ష్యాలు కాదని నెట్టింట పోస్ట్ చేశారు.
భారత మహిళల క్రికెట్ జట్టు దూకుడు కొనసాగుతోంది. వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ దక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. వడోదరలో జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్ నెగ్గడంతో ఆఖరి వన్డే మిగిలి ఉండగానే 2-0తో సిరిస్ టీమిండియా సొంతమైంది. అయితే, శుక్రవారం జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమే కానుంది.
ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మనూ బాకర్ తండ్రి రామ్ కిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా బిడ్డను క్రీడలవైపు ప్రోత్సహించడం నా తప్పు. పిల్లలను క్రీడల్లోకి తీసుకురావద్దని తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నా’ అని వెల్లడించారు. ఖేల్‌రత్న అవార్డు నామినేషన్ల జాబితాలో మను బాకర్‌కు చోటు దక్కలేదని వార్తా కథనాలు తెలిపాయి.
TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌కు ఇటీవల భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ టెండర్ల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. HCA ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23న దుబాయిలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లోనే నిర్వహిచనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే నిర్వహిస్తారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా తన బౌలింగ్ సీక్రెట్‌ను చెప్పాడు. తన మనసును ట్యూన్ చేసుకోవడంలోనే అతని విజయముందన్నారు. నిత్యం వైవిధ్యభరితమైన బంతులు సాధన చేస్తానన్నాడు. లెంథ్బాల్స్ను విపరీతంగా ప్రాక్టీస్ చేయడంతోనే ప్రతి బాల్ అలా వేయగలనన్నాడు. అలా ప్రాక్టీస్ చేయడంతోనే శరీరంలోని కండరాలు ఆ లయను గుర్తుంచుకుంటాయన్నాడు.