సిడ్నీలో చికిత్స పొందుతున్న టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా హెల్త్ ఆప్డేట్ ఇచ్చారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, క్రమంగా కోలుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
మహిళల ప్రపంచకప్-2025లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 125 పరుగుల తేడాతో చిత్తు చేసి తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. రేపు జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో సౌతాఫ్రికాతో ఆడుతుంది.
ప్రో కబడ్డీ సీజన్-12లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. క్వాలిఫయర్-2లో పుణేరీ పల్టాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 50-45 పాయింట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెకెండ్ హాఫ్‌లో డిఫెన్స్‌లో చేసిన అనవసరపు తప్పిదాల కారణంగా టైటాన్స్ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఫైనల్లో పుణేరీ పల్టాన్స్, దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.
ప్రొ కబడ్డీ సీజన్-12లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. క్వాలిఫయర్-2లో పుణేరీ పల్టాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 50-45 పాయింట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెకెండ్ హాఫ్‌లో డిఫెన్స్‌లో చేసిన అనవసరపు తప్పిదాల కారణంగా టైటాన్స్ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఫైనల్లో పుణేరీ పల్టాన్స్, దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.
ప్రో కబడ్డీ సీజన్-12 క్వాలిఫయర్-2లో తెలుగు టైటాన్స్, పుణేరీ పల్టాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 24-20 పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ ప్లేయర్ భరత్ 14 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో 20 నిమిషాల ఆట మిగిలి ఉంది. దీని తర్వాత ఫైనల్‌కు చేరే జట్టు ఏదో తేలనుంది.
మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 320 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్, కేవలం 1 పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్ మారిజానే కాప్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి మెయిడిన్ చేసింది. రెండో ఓవర్లో ఖాకా మరో వికెట్ తీసింది. దీంతో, ENG టాప్-3 బ్యాటర్లు 0 పరుగులకే పెవిలియన్ చేరారు.
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 169 పరుగుల భారీ సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె వన్డే క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా లారా వోల్వార్ట్ రికార్డు నెలకొల్పింది.
మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడుతున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 169 పరుగుల భారీ సెంచరీతో అదరగొట్టింది. మారిజానే కాప్ (42), తజ్మిన్ బ్రిట్స్ (45) పరుగులు చేసి రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 4, బెల్ 2 వికెట్లు పడగొట్టింది
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీగా వర్షం కురుస్తుండటంతో ఆట కొనసాగే అవకాశం లేదని భావించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈ నెల 31న జరగనుంది.
T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న T20 మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టడం ద్వారా సూర్య టీ20ల్లో 150 సిక్సర్ల మార్క్‌ను చేరుకున్నాడు. దీంతో, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ప్లేయర్ల జాబితాలో రోహిత్(205) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా రోహిత్ అగ్రస్థానంలో ఉండగా, సూర్య 5వ స్థానం దక్కించుకున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. భారత బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ (39), శుభ్‌మన్ గిల్ (37) దూకుడుగా ఆడుతున్న తరుణంలో వరుణుడు ఆటకు అడ్డుపడ్డాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి, భారత్ 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రతి ఇన్నింగ్స్‌కు 18 ఓవర్లకు కుదించారు. దీంతో ముగ్గురు బౌలర్లు 4 ఓవర్లు, ఇద్దరు బౌలర్లు 3 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. పవర్ ప్లేను 5.2 ఓవర్లకు నిర్ణయించారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.SA: లారా(c), బ్రిట్స్, లూస్, డెర్క్సెన్, బాష్, మారిజానే, జాఫ్తా(w), ట్రయాన్, డి క్లెర్క్, ఖాకా, మ్లాబాENG: జోన్స్(w), బ్యూమాంట్, నైట్, డేనియల్, బ్రంట్(c), సోఫియా, కాప్సే, డీన్, సోఫీ, స్మిత్, బెల్
కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి, భారత్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (16), సూర్యకుమార్ యాదవ్ (7) ఉన్నారు. అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ20లో భారత్‌కు తొలి షాక్ తగిలింది. 14 బంతుల్లో 4 ఫోర్లతో దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్‌కు తోడుగా సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.