IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 201/9 పరుగులు చేసింది. క్లాసెన్ (31), అనికేత్ వర్మ (43) రాణించారు. హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీష్ కుమార్ (1) తేలిపోయారు. RCB బౌలర్లలో డఫీ, షెఫర్డ్ చెరో 3 వికెట్లు తీశారు.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (80) సెంచరీ మిస్ చేసుకున్నాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో (15.6) ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. బౌండరీ వద్ద సాల్ట్ సింగిల్ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో 155 పరుగుల వద్ద హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది.
IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో 137 పరుగుల వద్ద హైదరాబాద్ 5వ వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో (14.3) సలీల్ అరోరా (9) వెనుదిరిగాడు. అంతకుముందు షెఫర్డ్ బౌలింగ్‌లో (13.1) ఫిల్‌సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (31) ఔటయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇషాన్ (74*) అనికేత్ (5*) క్రీజులో ఉన్నారు.
IPL 2026లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకే ఓవర్‌లో 21 పరుగులు రాబట్టారు. కృనాల్ పాండ్యా వేసిన 13వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాటర్లు మూడు సిక్స్‌లు బాదారు. మూడు సింగిల్స్ తీశారు. ప్రస్తుతం 13 ఓవర్లకు జట్టు స్కోర్ 126/3. ఇషాన్ 72*, క్లాసెన్ 31* క్రీజులో ఉన్నారు.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ (51*) చేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 11.2 ఓవర్లకు జట్టు స్కోర్ 97/3. ఇషాన్‌తో పాటు క్లాసెన్ 23* క్రీజులో ఉన్నాడు. హెడ్ 11, అభిషేక్ శర్మ 7, నితీశ్ కుమార్ 1 రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీశాడు.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRHకు బిగ్ షాక్ తగిలింది. 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి (1) క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు ఒకే ఓవర్‌లో అభిషేక్ (7), ట్రావిస్ హెడ్ (11)ను డఫీ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం SRH 5 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (23*), క్లాసెన్ (3*) పరుగులతో క్రీజులో ఉన్నారు. హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీష్ కుమార్ రెడ్డి (1) రన్స్ చేశారు. RCB బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీశాడు.
RCBతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో SRHకు ఆరంభంలోనే డబుల్ షాక్ తగిలింది. జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఓపెనర్లు అభిషేక్ (7), ట్రావిస్ హెడ్ (11) పెవిలియన్ చేరారు. 18 పరుగుల వద్ద తొలి వికెట్ కొల్పోయిన SRH.. 23 పరుగుల వద్ద తన హెడ్ ఔటయ్యాడు. దీంతో 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.
IPL 2026 సీజన్‌లో భాగంగా RCB, SRH మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ క్రీజులోకి వచ్చారు. జాకబ్ డఫీ బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. అంతకుముందు క్రికెటర్లు, అభిమానులు గత సీజన్‌లో RCB విజయోత్సవ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు.
IPL 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా SRH, RCB జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులో ప్రస్తుతానికి వర్ష సూచన లేదు. మ్యాచ్ సమయానికి కూడా వాతావరణం చాలా పొడిగానే ఉంటుందని ఆక్యూ వెదర్ నివేదిక పేర్కొంది. దీంతో ఇప్పటికైతే IPL తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా IPL 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో SRH, RCB తలపడుతున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా సహకరించే అవకాశం ఉంది. ఇతర మైదానాలతో పోలిస్తే చిన్నస్వామి స్టేడియం బౌండరీలు కాస్త చిన్నగానే ఉంటాయి. ఆరంభంలో పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభించనుంది. కనీసం 210 పరుగులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
IPL 2026 సీజన్‌లో భాగంగా SRHతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో RCB టాస్ గెలిచింది. కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. SRHని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సొంత గడ్డపై విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని RCB బరిలోకి దిగుతోంది. మరోవైపు RCBపై ఎలాగైనా గెలవాలని SRH భావిస్తోంది.
IPL 2026 సీజన్‌లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. RCB, SRH జట్ల మధ్య మ్యాచ్‌తో 19వ ఎడిషన్‌కు కర్టన్‌రైజ్ అవుతోంది. 7:30 గంటల నుంచి మ్యాచ్ మొదలవుతుంది. అయితే, ఇరు జట్లలో భారీ హార్డ్ హిట్టర్లు ఉన్నారు. దీంతో బౌలర్లపై బ్యాటర్లు కాస్త ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
IPL 2026 సీజన్‌లో RCB, SRH మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారిందన్నాడు. తప్పకుండా ఇది అతడికి గుర్తుండిపోయే రాత్రిగా మిగులుతుందని చెప్పాడు. అలాగే, RCBకి జాకబ్ బెతెల్ ఆటే హైలైట్‌గా నిలుస్తుందని అశ్విన్ అంచనా వేశాడు.