ఛాంపియన్స్ ట్రోఫీలో మార్చి 4(మంగళవారం) నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి 4న దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మార్చి 5న పాకిస్థాన్ వేదికగా జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. కాగా, అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్‌కు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ మరో 148 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర(14234) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(18426) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడుతుంది. దీంతో ఒకే మైదానంలో మ్యాచ్‌లు ఆడతుండటంతో భారత్ ప్రయోజనం పొందుతోందని పలువురు క్రికెటర్లు వాదిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని సౌతాఫ్రికా క్రికెటర్ వాన్ డర్ డస్సెన్ వ్యక్తం చేశాడు. భారత్ ప్రయోజనాన్ని పొందుతోందని అర్థం చేసుకోవడానికి రాకెట్ సైంటిస్ట్ కానక్కర్లేదన్నాడు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌లోని రావల్పిండి వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లో వర్షం కారణంగా టాస్ ఆలస్యం అవుతోంది. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి క్రికెటర్ రచిన్ రవీంద్ర బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన అతడు ఈ మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు. ఈక్రమంలోనే కివీస్ తరఫున వన్డేల్లో వేగంగా 1000 పరుగులు(26 ఇన్నింగ్స్‌ల్లో) చేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు.
KRNL: శివరాత్రి రాత్రి మహోత్సవాలు సందర్భంగా పంచ లింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఈనెల 28వ తేదీన అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించునున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసనాయన సోమవారం తెలిపారు. గెలుపొందిన వారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందజేయనున్నట్లు చెప్పారు.
ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కార్య దర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. ఈ జట్టు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి 6, 7, 8 తేదీలలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో 2023 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి టీమిండియా వరుసగా వన్డేల్లో 12 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్టుగా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. కాగా, నెదర్లాండ్స్(11) పేరిట ఉన్న రికార్డ్‌ను భారత్ బ్రేక్ చేసింది.
WPLలో వరుసగా రెండు ఓటముల తర్వాత యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. యూపీ మొదట 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు సాధించింది. ఛేజింగ్‌లో ఢిల్లీ 144కు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (56) పోరాటం వృథా అయ్యింది. క్రాంతి గౌడ్ (4/25) ఆ జట్టును దెబ్బకొట్టింది. గ్రేస్ హ్యారిస్ (4/15) హ్యాట్రిక్ సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ENGతో జరుగుతున్న మ్యాచ్‌లో AUS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ENG: సాల్ట్, డకెట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, కార్సే, ఆర్చర్, రషీద్, వుడ్AUS: హెడ్, షార్ట్, స్టీవ్ స్మిత్ (సి), లబుషేన్, ఇంగ్లిస్, క్యారీ, మాక్స్వెల్, ద్వార్షుయిస్, ఎల్లీస్, జంపా, స్పెన్సర్ జాన్సన్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 50* పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో వరుసగా 4వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 87, 60, 112 పరుగులు సాధించాడు.