• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

200 సిక్సర్ల క్లబ్‌లో రహానే

KKR కెప్టెన్ అజింక్య రహానే టీ20 కెరీర్‌లో ఓ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా రహానే, టీ20ల్లో 200 సిక్సర్ల మార్క్‌ను దాటాడు. ఈ మ్యాచ్‌లో రహానే కేవలం 40 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు.

March 29, 2026 / 09:38 PM IST

CSKకు షాక్.. స్టార్ బ్యాటర్ దూరం

RRతో రేపు జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ట్రైనింగ్ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో అతడు రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ఇప్పటికే ధోనీ గాయంతో దూరమవ్వగా, ఇప్పుడు బ్రెవిస్ కూడా దూరం కావడం జట్టుకు పెద్ద లోటు అని పేర్కొన్నాడు.

March 29, 2026 / 09:26 PM IST

BREAKING: ముంబై టార్గెట్ ఎంతంటే..?

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR 220/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రహానే(67) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఫిన్ అలెన్ 37 పరుగులు చేశాడు. గ్రీన్(18) తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ, రాఘువంశీ (51), రింకూ సింగ్ (33) చివర్లో ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. MI టార్గెట్: 221.

March 29, 2026 / 09:14 PM IST

IPL: రేపు RR vs CSK

రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రేపు ఆసక్తికర పోరు జరగనుంది. గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. CSK సారథిగా రుతురాజ్ గైక్వాడ్, RR కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నారు. అయితే, గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

March 29, 2026 / 08:50 PM IST

IPL: అజింక్య రహానే హాఫ్ సెంచరీ

వాంఖడేలో అజింక్య రహానే బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే, కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో రహానేకు ఇది 34వ అర్ధసెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 64 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న అతడు.. KKRను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. స్కోర్: 11 ఓవర్లలో 132/2.

March 29, 2026 / 08:29 PM IST

MI vs KKR: అజింక్య రహానే హాఫ్ సెంచరీ

వాంఖడేలో అజింక్య రహానే తన బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. MIతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే, కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో రహానేకు ఇది 34వ అర్ధసెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 64 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న అతడు.. KKRను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. స్కోర్: 11 ఓవర్లలో 132/2.

March 29, 2026 / 08:29 PM IST

IPL: కేకేఆర్ జోరుకు శార్దుల్ బ్రేక్

MIతో మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న KKR జోరుకు శార్దుల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. 69 పరుగుల వద్ద ఫిన్ అలెన్ (37)ను పెవిలియన్ చేర్చి ముంబైకి తొలి వికెట్‌ను అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రీన్(18) కూడా శార్దుల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 109 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.

March 29, 2026 / 08:24 PM IST

IPL: ఒకే ఓవర్‌లో 26 పరుగులు

MIతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 14 బంతుల్లో 32 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 12 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నారు. ముఖ్యంగా పాండ్యా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ జోడీ 2 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించడం విశేషం.

March 29, 2026 / 07:55 PM IST

IPL: 6 మ్యాచ్‌లకు ధోనీ దూరం!

ధోనీ గాయంతో రెండు వారాల పాటు IPLకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, గాయం తీవ్రత దృష్ట్యా ధోనీ కోలుకోవడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో CSK ఆడే 6 మ్యాచ్‌లకు MSD దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ధోనీ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది.

March 29, 2026 / 07:49 PM IST

బ్లాక్ టికెట్ల దందా.. మాజీ క్రికెటర్ అరెస్ట్

2026 టీ20 ప్రపంచకప్‌ బ్లాక్ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ముంబైకి చెందిన మాజీ అండర్-19 క్రికెటర్ బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2,500 టికెట్‌ను ఏకంగా రూ. 25,000కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు సోధాను కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది.

March 29, 2026 / 07:38 PM IST

MI vs KKR: ప్లేయింగ్-11

MI: రోహిత్, రికెల్టన్(w), తిలక్, పాండ్యా(c), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్, మయాంక్ మార్కండే, ఘజన్‌ఫర్, బౌల్ట్, బుమ్రా. IMPACT: సూర్య, బాష్, మింజ్, రాజ్ బావా, అశ్వనీ కుమార్KKR: ఫిన్ అలెన్, రహానే(c), గ్రీన్, రఘువంశీ(w), రింకూ, రమణదీప్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజారబానీ. IMPACT: పాండే, పావెల్, త్యాగి, సౌరభ్ దూబే, తేజస్వి

March 29, 2026 / 07:10 PM IST

MI vs KKR: టాస్ గెలిచిన ముంబై

IPLలో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే వేదికగా కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు పడే అవకాశం ఉండటంతో పాండ్యా ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. కాగా, ఈ రెండు జట్ల మధ్య జరిగిన 35 మ్యాచ్‌ల్లో ముంబై 24 సార్లు విజయం సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

March 29, 2026 / 07:00 PM IST

భారత మీడియాపై స్టార్క్ ఫైర్

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తన ఫిట్‌నెస్ గురించి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాడు. గాయం కారణంగా KKRకు దూరం కావడం తనను బాధిస్తోందన్నాడు. ఈ సందర్భంగా ఆ జట్టు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. వీలైనంత త్వరగా కోలుకుని IPL బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.

March 29, 2026 / 06:55 PM IST

గర్ల్‌ఫ్రెండ్‌కు పాండ్యా బెంజ్ కారు గిఫ్ట్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు కోటిన్నర విలువైన మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇది భారత్‌లోనే మొదటి మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ మోడల్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

March 29, 2026 / 06:15 PM IST

MI vs KKR: వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్ట్

ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామంగా ప్రసిద్ధి చెందింది. చిన్న బౌండరీలు, ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి. ప్రారంభంలో పేసర్లకు కొత్త బంతితో కొంత స్వింగ్ లభిస్తుంది. రాత్రి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్లు మొదట బౌలింగ్ ఎంచుకుంటాయి. ఈ గ్రౌండ్‌లో సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్: 180.

March 29, 2026 / 06:07 PM IST