PDPL: సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపికైనట్లు మంథని జేకేఏ షోటాకాన్ కరాటే ఇన్స్ట్రక్టర్ కొండ్ర నాగరాజ్ సోమవారం తెలిపారు. బాబి వర్మ, ఇంద్రాణి, రోహిత్, శ్రావణ్ కుమార్, శ్రీచరణ్, తోట హాసిని, ఆదిత్య తేజ బహుమతులు గెలుపొందినట్లు వివరించారు. ఈనెల 31 నుండి జనవరి 2 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
MDK: కల్హేర్ మండలం కృష్ణాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల 57వ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నర్సాపూర్‌లో జరిగిన ఎంపికల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు సంయుక్త, సోనా, పూజ వర్ష, శ్రీలత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు సుధాకర్ తెలిపారు. వారిని పీఈటీ రాములు, ఉపాధ్యాయుల బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా హిట్‌మ్యాన్ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అండర్ 19 ఆసియా మహిళల టీ20 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 76 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు తీసుకుంది. సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా చెరో 2 వికెట...
భారత మహిళల క్రికెట్ జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తలపడనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. గాయంతో వెస్టిండీస్‌తో రెండు టీ20లకు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి రానుంది. అలాగే, గత అయిదేళ్లలో సొంతగడ్డపై తొలిసారి సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డేల్లోనూ సత్తా చాటాలని...
ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 24వ తేదీన ఒంగోలులో జరగనుంది. మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్లో ఉదయం 9గంటలకు ఎంపిక జరుగుతుందని అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన జట్టు జనవరి 9న ఎన్టీఆర్ జిల్లా మూలగుంటపాడులో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలలో పాల్గొంటుందన్నారు.
భారత్ వేదికగా వచ్చే ఏడాది ISSF జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరగనున్నట్లు జాతీయ రైఫిల్ సమాఖ్య (NRIA) అధికారిక ప్రకటన చేసింది. దేశంలో షూటింగ్‌కు ఉన్న క్రేజ్, వసతి సౌకర్యాలు వరల్డ్ కప్ ద్వారా మరింతగా ప్రాచుర్యంలోకి రానున్నాయి. మెగాటోర్నీకి సంబంధించి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కాగా, సీనియర్ ప్రపంచకప్ (2023), వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత భారత్‌లో జరగనున్న మేజర్ అంతర్జాతీయ టోర్నీగా నిలవనుంది.
టీమిండియా ఆల్ రౌండర్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో టాపార్డర్ బ్యాటర్లు చేసే పరుగులే చాలా కీలకమన్నాడు. టాపార్డర్ విఫలమైనపుడు లోయర్ ఆర్డర్‌పై బాధ్యత, ఒత్తిడి పెరుగుతుందన్నాడు. నాలుగో టెస్టులో టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు రాణిస్తారని ఆశిస్తున్నామన్నాడు.
TPT: తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు జూడో జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జూడో సంఘం జిల్లా కార్యదర్శి జగదీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 97012 99908 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం శృంగవృక్షం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి జిల్లా నూతన హ్యాండ్‌బాల్ సంఘాన్ని నియమించనున్నారు. ఈ మేరకు మాజీ అధ్యక్ష, కార్యదర్శులు వై. లక్ష్మీనారాయణ, కె. అలివేలు మంగ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో తొలిరోజే భారీ రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్సింగ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఈ సంచలన( 115* 45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కాగా, IPL మెగా వేలంలో అతడు అన్ స...
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సిరీస్‌లు సాధిస్తామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశాడు. ‘మేం మంచి స్థితిలో ఉన్నాం. 3 మ్యాచ్‌ల తర్వాత 1-1తో సిరీస్ ఆసక్తికరంగా మారింది. రాబోయే రెండు మ్యాచుల్లో మేం ఒకటి గెలిచిన సిరీస్‌ను కాపాడుకుంటాం. ఎందుకంటే గత రెండుసార్లు ఇక్కడ మేం సిరీస్ గెలుచుకున్నాం’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు తమ ఫోకస్ అంతా బాక్సింగ్‌డే టెస్టుపైన...
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు బృహత్ మహానగర పాలికే సంస్థ అధికారులు షాక్ ఇచ్చారు. కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌కు BBMP అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని రత్నం కాంప్లెక్స్ 6వ ఫ్లోర్లో కోహ్లీ పబ్ ఉండగా.. నవంబర్ 29న సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఫిర్యాదు చేశాడు.
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ సాధించి ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 26 నుంచి మెల్బోర్న్లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ముందు జడేజా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. గత రెండు పర్యటనల్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఉతప్ప దుస్తుల కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధిలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. డిసెంబర్ 27లోపు రూ.24 లక్షల బకాయిలు చెల్లించాలని, లేకపోతే అరెస్టు తప్పదని హెచ్చరించారు. బెంగళూరులోని సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉతప్ప వ్యవహరిస్తున్నాడు.