రేపు న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని జట్టు నుంచి తొలగించి, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని చెప్పాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మను ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగించాలని ఆయన సూచించాడు.