టీ20 క్రికెట్లో నెం.1 బౌలర్‌గా కొనసాగుతున్న వరుణ్ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు బౌలింగ్ చేసేటప్పుడు ‘రౌండ్ ది వికెట్’ రావద్దని వరుణ్‌కు చాలాసార్లు సూచించినట్లు పేర్కొన్నాడు. అయితే, అతడు పదేపదే అదే తప్పు చేస్తున్నాడని తెలిపాడు.