టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అన్నాడు. ట్రోఫీ సాధించడం కోసం 140 కోట్ల భారత అభిమానుల హృదయాలను బ్రేక్ చేయడానికి కూడా తాము వెనకాడబోమని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఫైనల్ కావడంతో తమకంటే భారత జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. ఫైనల్లో విజయమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు.