రేపు భారత్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను చూసి అంతగా భయపడాల్సిన పని లేదన్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ, అతడు కూడా ఒక మనిషేనని చెప్పాడు. ఏదో ఒక రోజు అతడు విఫలమవుతాడని, అది ఈ ఫైనలే అవ్వాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. బుమ్రాను ధాటిగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.