RR: శేరిలింగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జరిగిన జెండా పండుగలో టీఆర్ఎస్ షాద్నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంగాపురం ఉమాదేవి ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.