• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IPL 2026: నాంద్రే బర్గర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ 

అస్సాం గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో RR బౌలర్ నాంద్రే బర్గర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. అతను నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సంజుశాంసన్ (6), ఆయుష్ మాత్రే(0)ను పెవిలియన్‌కు పంపాడు.

March 30, 2026 / 11:32 PM IST

BREAKING: చిత్తుగా ఓడిన చెన్నై

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 128 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ(52), జైశ్వాల్(37*) రన్స్‌తో రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు.

March 30, 2026 / 10:38 PM IST

BREAKING: 15 బంతుల్లో వైభవ్ హాఫ్ సెంచరీ

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విజృంభించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కాగా చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

March 30, 2026 / 10:05 PM IST

RR vs CSK: రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

IPL 2026లో భాగంగా RRతో జరుగుతున్న మ్యాచ్‌లో CSK ఇన్నింగ్స్ ముగిసింది. RR బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.4 ఓవర్లలో చెన్నై 127 పరుగులకే ఆలౌట్ అయింది చేసింది. ఓవర్‌టన్(43) తప్ప మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో జడేజా, బర్ఘర్, ఆర్చర్ తలో రెండు వికెట్లు, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేష్ తలో వికెట్ తీశారు. RR టార్గెట్: 128.

March 30, 2026 / 09:21 PM IST

57 పరుగులకే 6 వికెట్లు డౌన్

RRతో జరుగుతున్న మ్యాచ్‌లో CSK పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన CSKను రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కేవలం 8.0 ఓవర్లలోనే 57 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి CSK పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ రుతురాజ్(6), సంజూ శాంసన్(6) నిరాశపరిచారు. జడేజా, నాండ్రే బర్ఘర్ చెరో రెండు వికెట్లు, ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.

March 30, 2026 / 08:19 PM IST

కష్టాల్లో CSK.. 3 వికెట్లు డౌన్

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న పోరులో CSK ఆదిలోనే భారీ దెబ్బ పడింది. కేవలం 3 ఓవర్లు ముగిసే సమయానికే 3 కీలక వికెట్లు కోల్పోయి కేవలం 19 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లు దాటికి CSK బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మరి ఈ కష్టాల్లోంచి జట్టును గట్టెక్కించే ప్లేయర్ ఎవరో వేచి చూడాలి.

March 30, 2026 / 07:58 PM IST

RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్

IPL 2026 సీజన్‌లో భాగంగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RR టాస్ గెలిచింది. కెప్టెన్ రియాన్ పరాగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని CSKను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గౌహతి వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సంజూ, వైభవ్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు.

March 30, 2026 / 07:05 PM IST

బౌలింగ్ చేయని గ్రీన్.. స్పందించిన ఆస్ట్రేలియా

MIతో జరిగిన మ్యాచ్‌లో KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. కెప్టెన్ రహానె కూడా ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా(CA)నే అడగాలని సూచించాడు. ఈ నేపథ్యంలో CA స్పందించింది. గ్రీన్‌కు వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్నాడని.. 10-12 రోజుల్లో బౌలింగ్ చేసే సామర్థ్యం కోసం కష్టపడుతున్నాడని తెలిపింది.

March 30, 2026 / 05:49 PM IST

రోహిత్ 2.O రెడీ..: అనిల్ కుంబ్లే

కోల్‌కతాపై రోహిత్ శర్మ విధ్వంసక ఆట తీరును చూస్తుంటే ‘రోహిత్ 2.O’ సిద్ధమైనట్లు కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. నరైన్, వరుణ్ వంటి స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు. KKR తమ బౌలింగ్ వనరులను సరిగ్గా వాడుకోలేదని, ముఖ్యంగా పవర్‌ప్లేలో నరైన్‌ను ఆలస్యంగా దించడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని వివరించాడు.

March 30, 2026 / 04:50 PM IST

బంగ్లాదేశ్‌లో IPL ఫ్యాన్స్‌కు SHOCK

బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది IPL మజా ఇక కలగానే మిగలనుంది. IPL-2026 బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో హాట్‌స్టార్ అనూహ్యంగా రద్దు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం రావడం చర్చనీయాంశమైంది. దీంతో అక్కడి ప్రేక్షకులు IPL లైవ్ ధమాకాను వీక్షించే సువర్ణావకాశాన్ని కోల్పోయారు.

March 30, 2026 / 03:32 PM IST

మిస్టరీ స్పిన్నర్ పని అయిపోయిందా..?

KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ అదే సీన్ పునరావృతమైంది. MIతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. ఇదే ప్రదర్శన కొనసాగితే ‘మిస్టరీ స్పిన్నర్‌’గా గుర్తింపు పొందిన వరుణ్, ఇక ‘హిస్టరీ’గా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

March 30, 2026 / 01:27 PM IST

రోహిత్ ఫామ్‌పై MI కోచ్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ శర్మ ఫామ్‌పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఈ సీజన్‌లో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడని తెలిపాడు. ప్రాక్టీస్ క్యాంప్ మొదటి రోజు నుంచే జట్టుతో చేరి, పూర్తి ఏకాగ్రతతో సాధన చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, KKRతో అతడు ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.

March 30, 2026 / 12:09 PM IST

IPL: వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు

IPL 2026 ఓపెనింగ్ వీకెండ్ జియో హాట్‌స్టార్ రికార్డు స్థాయి వ్యూస్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లు డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. RCB, SRH మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌కు 42.6 కోట్ల (426M) వ్యూస్ లభించాయి. అలాగే, MI, KKR మ్యాచ్ 35.1 కోట్ల (351M) వ్యూస్ అందుకుంది.

March 30, 2026 / 11:58 AM IST

ధోనీ దూరం.. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్

RRతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ధోనీ గాయంతో దూరం కావడంతో సంజూ వికెట్ కీపింగ్ చేయనున్నాడని ఆ జట్టు సీఈవో తెలిపాడు. అలాగే, CSK అభిమానులు కూడా సంజూను ఎంతగానో అభిమానిస్తున్నారని ఆయన వెల్లడించాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో అతడికి అభిమానులు ఏ విధంగా స్వాగతం పలికారో చూస్తేనే, వారికి సంజూపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని పేర్కొన్నాడు.

March 30, 2026 / 11:11 AM IST

CSK vs RR: హెడ్ టు హెడ్ రికార్డ్

IPL చరిత్రలో CSK, RR మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్లు దాదాపు సమానమైన రికార్డును కలిగి ఉన్నాయి. రెండు జట్లు 31 మ్యాచ్‌ల్లో తలపడగా.. CSK 16, RR 15 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే, గత 10 మ్యాచ్‌ల్లో 8 గెలిచి RR ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సీజన్‌లో RRకు రియాన్ పరాగ్, CSKకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నారు.

March 30, 2026 / 10:50 AM IST