ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ రెండో సెమీఫైనల్లో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్ చేరింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 179/5 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 173/9 పరుగులకే పరిమితం అయింది. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇండియాతో వెస్టిండీస్ తలపడనుంది.
WPL లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన RCB 3 వికెట్ల నష్టానికి199 పరుగులు చేసింది. ఛేసింగ్‌లో ఛేసింగ్‌లో చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు 188 పరుగులకే ముంబైని కట్టడి చేశారు. దీంతో RCB 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్‌తో పాటు కీలక ఆటగాళ్లుకు రెస్ట్ ఇచ్చింది. దీంతో ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. ఈ సిరీస్‌లో పాక్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించింది. దీంతో టీమిండియా రూ.19 కోట్ల 52 లక్షల భారీ ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ రూ.9 కోట్ల 76 లక్షలు పొందింది. సెమీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు దాదాపు రూ.4.87 కోట్లు అందుకున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 53 శాతం పెరిగింది.
ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అయితే, ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఆతిథ్య పాకిస్థాన్ నుంచి ఏ ప్రతినిధి లేకపోవడంపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. పీసీబీ తీరుపై విమర్శలు గుప్పించాడు. ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్‌కు చెందిన ఒక్క ప్రతినిధి లేకపోవడం బాధగా ఉందన్నాడు. ఎందుకు పీసీబీ ప్రతినిధిని పంపించలేదని ప్రశ్నించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు బిగ్ షాక్ తలిగింది. 122 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గిల్ (31), కోహ్లీ (1) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరారు. ఇక ఇన్నింగ్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ (76) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయస్ (15*), అక్షర్ (0*) పరుగులతో ఉన్నారు.
న్యూజిలాండ్ 165 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 37.5వ ఓవర్‌కు గ్లెన్ ఫిలిప్స్ ((34) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో మిచెల్, ఫిలిప్స్ 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 38 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 165/5. మైకేల్ బ్రాస్‌వెల్ (0*), డారిల్ మిచెల్ (44*) క్రీజులో ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.IND: రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయస్, అక్షర్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి.NZ: యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్ మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, జేమీసన్, నాథన్ స్మిత్, విలియమ్ రూరౌర్కీ.
న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకోనున్నాడు. కోహ్లీకి ఈ మ్యాచ్ అంతర్జాతీయ కెరీర్లో 550వ మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్(664) మాత్రమే ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో ప్లేయర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. ఓవరాల్‌గా ఆరోవ ప్లేయర్‌గా నిలుస్తాడు.
రోహిత్ రిటైర్మెంట్పై మాజీ కెప్టెన్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ విషయంపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ‘రోహిత్ కెప్టెన్‌గా T20 వరల్డ్ కప్ అందించాడు. 2023 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేర్చాడు. ప్రస్తుతం అతడి కెప్టెన్సీలోనే CT ఫైనల్ ఆడనుంది. అలాంటప్పుడు అతడి రిటైర్మెంట్పై చర్చ ఎందుకు’ అని అన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది. పంచకట్టులో ధోనీ దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన అభిమానులు వారెవ్వా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన ధోని ఐపీఎల్లో మాత్రం CSKకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
రోహిత్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ కేవలం 20 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే టీమిండియాదే గెలుపు అని తెలిపాడు. ‘రోహిత్ అద్భుతమైన కెప్టెన్. కానీ బ్యాటర్‌గా విఫలం అవుతున్నాడు. అయితే అతడు దూకుడుగా ఆడుతూ.. వేగంగా పరుగులు రాబడుతాడు. ఫైనల్లో 20 ఓవర్లు పాటు అతడు ఆడితే టీమిండియా విజేతగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు కలిసోస్తుందని పలు దేశాల మాజీలు విమర్శిస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు. బాగా ఆడితే టోర్నమెంట్లను గెలుస్తారని, సాకులతో కాదని తెలిపాడు. టీమిండియా బాగా ఆడటం వల్లే ఫైనల్‌కు చేరిందని స్పష్టం చేశాడు.
భారత మాజీ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తల్లి కాబోతోంది. ఈ మేరకు తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ఆమె స్వయంగా ప్రకటించింది. ‘కొత్త ఛాప్టర్తో మా లవ్ స్టోరీ కొనసాగుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా, 2018లో వినేశ్, సోమ్‌వీర్ రథీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ చేరుకున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ICC టోర్నీ ఫైనల్స్‌లో రెండు సార్లు తలపడ్డాయి. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీపడగా కివీస్ విజయం సాధించింది. దీంతో ఆదివారం జరిగే ఫైనల్స్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.