ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 105/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్ 149 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ముందు 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతీకా రావల్(63) ఒంటరి పోరాటం చేసింది. స్మృతి మంధాన(2), జెమీమా(14), షెఫాలీ(5), హర్మన్‌ప్రీత్(11), దీప్తి(9) విఫలమయ్యారు.