SRCL: వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలను వీక్షించి విజేతలను అభినందించారు. ఈ మేరకు మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.