TG: వరంగల్ భూగర్భ డ్రైనేజీకి రూ.5,257 కోట్ల నిధులు మంజూరు చేయడంపై MLA నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. గతంలో BRS తమ ప్రాంతాన్ని నాశనం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన వచ్చాక వరంగల్లో భూకబ్జాలు లేవని, విమానాశ్రయ భూసేకరణకు రూ.300 కోట్లు కేటాయించారని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.