ఆస్ట్రేలియా మహిళా జట్టుతో ఏకైక టెస్టులో భారత్ ఓటమి అంచున నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 2వ ఇన్నింగ్స్లో భారత్ 105/6 స్కోరుతో 20 రన్స్ వెనకబడి ఉంది. ఇప్పటికే T20, ODI సిరీసులు కోల్పోయి నేపథ్యంలో.. ఈ టెస్ట్ అయినా గెలవాలంటే క్రీజులో ఉన్న ప్రతికా రావల్(43), స్నేహ్ రాణా(14) నిలబడి పోరాడితేనే సాధ్యం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 198, ఆస్ట్రేలియా 323 స్కోర్ చేశాయి.