PPM: టౌన్ రైల్వే స్టేషన్లోని రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృత దేహాన్ని ఇవాళ GRP పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడు బ్రౌన్ కలర్ జీన్, నీలిరంగు టీ షర్ట్ ధరించి 22 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందని HC రత్నకుమార్ తెలిపారు. అతడి సమాచారం తెలిస్తే పార్వతీపురం GRP పోలీసులకు సమాచారం అందించాలన్నారు.