AP: రాజమండ్రి కల్తీ పాల ఘటన కేసులో రెండోరోజు విచారణ కొనసాగుతోంది. పాల వ్యాపారి గణేష్‌ను కొవ్వూరు డీఎస్పీ రెండోరోజు విచారిస్తున్నారు. పాలలో విషపూరితమైన ఈజీ ఇథైలిన్ గ్లైకాల్ కలిసినట్లు నిర్ధారించారు. దీంతో పాల వ్యాపారిపై ఇప్పటికే పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. కాగా, కల్తీ పాల ఘటనలో 11 మంది మృతిచెందగా, ఆసుపత్రుల్లో మరో 10 మంది చికిత్స పొందుతున్నారు.